హైదరాబాద్‌ను మిస్ అవుతున్నా : డేవిడ్ వార్నర్
- MediaFx
- Aug 28, 2024
- 1 min read
‘చార్ సౌ సాల్ కా షహర్’గా పిలుచుకునే హైదరాబాద్ అంటే అభిమానం ఎవరికి ఉండదు. ఒక్కసారి ఈ నగరంతో కనెక్ట్ అయ్యామంటే జీవితాంతం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. హైదరాబాదీ ప్రజల ప్రేమాభిమానాలకు దాసోహమైన మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం భాగ్యనగరాన్ని చాలా మిస్ అవుతున్నానని తెలిపాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గతంలో సారథిగా వ్యవహరించిన అతడిని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ‘వార్నర్ భాయ్’ అని పిలుచుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అతడు.. హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ ఫొటోను షేర్ చేస్తూ ‘నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నా’ అని రాసుకొచ్చాడు.