top of page

🌟 జక్కన్నను ఇంప్రెస్ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ..

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో దర్శకుడు రాజమౌళి ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి ఎంతో మంది హీరోయిన్లతో పని చేశారు.

తనకు నచ్చిన హీరోయిన్ అనుష్క అని గతంలో ఆయన చెప్పారు. ఇప్పుడు అనుష్క తర్వాత తనకు నచ్చిన హీరోయిన్ ఎవరో చెప్పారు. ఆయనకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన 'ప్రేమలు' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక ట్వీట్ చేశారు. 🎬 సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ట్రైలర్ చూసినప్పుడే రీను పాత్ర చేసిన అమ్మాయి తనకు బాగా నచ్చిందని తెలిపారు.

 
 
bottom of page