🎥 మహేష్ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న విశ్వక్ 🎥
- Shiva YT
- Mar 15, 2024
- 1 min read
Updated: Mar 16, 2024
🌟🎥సినిమాల్లోనూ.. రియల్ లైఫ్‌లోనూ ఆల్మోస్ట్ ఓకే టోన్‌లో.. ఓకే టెంపోలో.. అదే యాటిట్యూడ్‌తో మాట్లాడే విశ్వక్ సేన్.. ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పెట్టుకున్నాడు. నేరుగా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా.. సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఈ స్టార్ హీరో చేసిన కామెంట్స్ వాళ్లకు కోపం వచ్చేలా చేసి. ట్రోల్ అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే! తన సినిమా ‘గామి’ని ప్రమోట్ చేసే క్రమంలో.. తన సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడాలన్నారు. ఇది మన తెలుగు సినిమా కదా అంటూ.. గుర్తు చేశారు. అయితే విశ్వక్.. ఈ కామెంట్స్ మహేష్ అండ్ జక్కన్న ను దృష్టిలో పెట్టుకునే చేశారని అంటున్నారు అందరూ. వారిద్దరే రీసెంట్గా ప్రేమల మలయాళ డబ్బింగ్ మూవీ చూసి మెచ్చుకున్నారు. 🌟🎥








































