top of page

🧘‍♂️ యోగా వర్సెస్‌ వాకింగ్‌.. బరువు తగ్గడానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?

🏋️ ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన గుండె అవసరం. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడానికి వాకింగ్ ఒక అద్భుతమైన మార్గంగా సూచించబడింది.

ree

అంతేకాదు నడక రక్త ప్రసరణను కూడా నియంత్రిస్తుంది.

🚶 వాకింగ్‌- యోగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. నడక కేలరీలను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు, యోగా దృష్టి కేంద్రీకరించడం, జీవక్రియను పెంచడం, శరీరం మరియు మనస్సును సమతుల్యం చేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. ఇలా యోగా మరియు నడక రెండూ బరువు తగ్గడానికి రెండు ముఖ్యమైన మార్గాలు. యోగా, వాకింగ్‌ ఏది చేసినా సరే…. బరువు తగ్గాలనుకున్నవారు ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. 🚶‍♀️🧘‍♀️

 
 
bottom of page