‘లియో’ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఫుల్‌మూవీ ఆన్‌లైన్‌లో లీక్ 🎥😲
- Suresh D
- Oct 19, 2023
- 1 min read
లియో సినిమాను వెబ్‌సైట్లలో అక్రమంగా విడుదల చేయడానికి నిషేధం విధిస్తూ.. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొందరు హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసినట్లు తెలుస్తోంది.

దళపతి విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన లియో మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే కొందరు తమిళ అభిమానులు నెట్టింట తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ అర్థం కాలేదని.. లోకేశ్ మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడని అంటున్నారు. సినిమా టాక్ విషయం పక్కన పెడితే.. మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. లియో సినిమాను వెబ్‌సైట్లలో అక్రమంగా విడుదల చేయడానికి నిషేధం విధిస్తూ.. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొందరు హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసినట్లు తెలుస్తోంది. సెవన్ స్క్రీన్ స్టూడియో నిర్మాణ సంస్థ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అక్రమంగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది . అయితే కొన్ని వెబ్‌సైట్లలో లియో ఫుల్ మూవీ లీక్ అవ్వడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైరసీ సైట్స్ నుంచి లియో సినిమాను తొలగించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.🎥😲
Leo Full Movie Download