top of page

మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..


ree

పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలో ఎన్నికల ముందు లోకల్‌ నాన్‌ లోకల్‌ నినాదం హీటెక్కింది. నాన్‌లోకల్‌ అయిన పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం ప్రజల బాధలు పట్టవు. ఎన్నికల అనంతరం ఆయన పెట్టేబేడా సర్దుకుని పారిపోవడం ఖాయం అంటూ పవన్‌ ప్రత్యర్థులు ప్రచారం నిర్వహించారు. అందుకు ధీటుగా పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రచారం చేశారు. తాను శాసనసభ్యుడిగా గెలిచిన మరుక్షణం పిఠాపురంలోనే ఇళ్లు కట్టుకుని ఇక్కడే ఉంటానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పవన్‌తో పాటు ఆయన పార్టీ అభ్యర్థులు 100% స్ట్రైక్‌ రేట్‌తో బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు.

ఇక ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిఠాపురంలోనే ఉంటానన్న మాటను నిలబెట్టుకునే దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో ఇల్లు నిర్మించుకునేందుకు 3.52 ఎకరాల స్థలాన్ని కొన్నారు. కాకినాడ జనసేన నేత తోట సుధీర్.. పవన్ తరపున స్థలాన్ని కొనుగోలు చేశారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఈ భూమిని పవన్ కల్యాణ్‌ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.

 
 
bottom of page