top of page

‘కేసీఆర్‌, రేవంత్‌లను ఓడించిన ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు..’🏃‍♂️🏹

‘కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉద్దండులను ఓడించి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందిన ఆ కాషాయ నేతకు బీజేపీ అగ్ర నాయకత్వం కీలక బాధ్యత అప్పగించాలనే ఆలోచన చేస్తోందా..? 🤔 పార్టీ కోసం ఆయన సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుందా..? 🚀

ree

ఇప్పటికే రెండు కీలక బాధ్యతలు అప్పగించిన కాషాయ పార్టీ.. ఆ ఇద్దరిని ఓడించిన సదరు నేతకు ఎలాంటి గిప్ట్ రెడీ చేసిందన్నది ఆసక్తికరంగా మారింది. 🎯 కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి త్వరలో గోల్డెన్ ఛాన్స్ దక్కనుందట. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సదరు ఎమ్మెల్యేగా గెలిచారు రమణారెడ్డి. 🥇 అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టినా.. ఆయన విజయం దేశం దృష్టిని ఆకర్షించిందట. ఆయన విజయం కాషాయ పార్టీ పెద్దల మనస్సు దోచిందట. 🏆 దీంతో ఆయన సేవలను పార్టీకోసం విస్తృతంగా వాడుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించారట జాతీయ నేతలు. 🗳️ దీంతో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం.. రమణారెడ్డిని జహీరాబాద్ ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. అయోధ్య శ్రీ రామ తీర్ధ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గా ఆయనకు అవకాశం కల్పించారు కూడా. 🚃 కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రమణారెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు చుట్టి రావడంతో పాటు.. అయోధ్య తీర్ధ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారట. ఇలా పార్టీలో కీలత బాధ్యతలు నిర్వహిస్తున్నారట రమణారెడ్డి. ఐతే ఆయనకు మరో గిప్ట్ సైతం రెడీ చేసిందట బీజేపీ అగ్రనాయకత్వం.. 🌐


 
 
bottom of page