top of page

🌊 ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ.. తప్పకుండా చూడాల్సిన వాటర్ ఫాల్స్ ఇవే!

🏞️ సమ్మర్ వచ్చేస్తుంది.. పిల్లలకు హాలిడేస్ రావడంతో అందరూ టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మనసుకు ప్రశాంతంగా.. అన్నీ మర్చిపోయి ఉండాలని అనుకుంటారు. ఇండియాలో అలాంటి బెస్ట్ ప్లేసులు చాలా ఉన్నా.. కేరళ మాత్రం అందుకు భిన్నం. కేరళలో ఎక్కడ చూసినా పచ్చదనం ఆకర్షిస్తుంది. అంతే కాదు భారత దేశంలోనే ఇక్కడ అత్యంత ఉత్కంఠభరితమైన జలపాతాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకోసం.

ree

🏞️ 1. అతిరప్పిల్లి వాటర్ ఫాల్స్: కేరళలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాల జాబితాలో అతిరప్పిల్లి జలపాతం అగ్ర స్థానంలో ఉంది. షోలయార్ అటవీ శ్రేణుల ప్రవేశ ద్వారం వద్ద ఈ జలపాతం ఉంటుంది. పశ్చిమ కనుమలను తన నివాసంగా పిలిచే చలకుడి నదిలో ఇది కూడా ఒక భాగం. ఈ వాటర్ ఫాల్స్ 80 అడుగుల ఎత్తులో ఉంటుంది.

🏞️ 2. మీన్ ముట్టి వాటర్ ఫాల్స్: వాయనాడ్ జిల్లాలో పశ్చిమ కనుమల పచ్చదనం మధ్య దాగి ఉన్న మూడు అంచెల జలపాతం మీన్‌ముట్టి జలపాతం. ఈ వాటర్ ఫాల్స్ చూపరులను ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంది. ప్రకృతి అందాల మధ్య జాలువారే ఈ జలపాతం అందరికీ బాగా నచ్చుతుంది. ఈ సమ్మర్‌లో కూల్‌గా ఇక్కడ సేద తీరవచ్చు.

🏞️ 3. సూచిపర జలపాతాలు సూచిపర జలపాతాలను సెంటినెల్ రాక్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. కేరళలో చూడాల్సిన ప్రకృతి దృశ్యాల్లో ఇది కూడా ఒకటి. సుమారు 200 అడుగుల ఎత్తు నుండి నీరు కిందికి జాలువారుతూ ఉంటాయి. ఈ జలపాతం బేస్ వద్ద ఉన్న సహజ కొలనుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు వచ్చిన సందర్శకులు చల్లటి నీటితో రీఫ్రెష్ అవడం ఖాయం.

🏞️ 4. పాలరువి జలపాతాలు కేరళ టూరిజంలో పాలరువి జలపాతాలు కూడా ఒకటి. పాలరువి జలపాతం.. నిజంగానే పాలులాగా తెల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఇక్కడ జలపాతంలో బాగా ఎంజాయ్ చేయవచ్చు.

🏞️ 5. తుషారగిరి జలపాతాలు ఈ తుషారగిరి జలపాతాల్లో మూడు ఇతర చిన్న వాటర్ ఫాల్స్ కూడా కలిపి ఉంటాయి. పచ్చని అడువుల మధ్య ఉండే ఈ తుషారగిరి వాటర్ ఫాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ కూడా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయవచ్చు. 🏞️✨

 
 
bottom of page