top of page

🎬కరీనా కపూర్ ఫస్టు వెబ్ సిరీస్ గా 'జాన్ జాన్' నెట్ ఫ్లిక్స్ కి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్!

బాలీవుడ్ తెరను హీరోయిన్ గా కొంతకాలం పాటు కరీనా కపూర్ ఏలేసింది. 🎥 వివాహమైన తరువాత సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చినప్పటికీ, ఆమె అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. 📈

తాజాగా ఆమె వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టడం విశేషం. 👀🎬 తొలిసారిగా ఆమె హిందీలో ఒక భారీ వెబ్ సిరీస్ ను అంగీకరించింది. 🌐📺 ఆ సిరీస్ పేరే 'జాన్ జాన్' .. నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. 📽️💻 క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. 🎥🕵కరీనా కపూర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ - జైదీప్ అహ్లావత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 👮‍♂️👨‍🏫 ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ ... ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక ఉపాధ్యాయుడు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 🤫📚 మాయ అనే ఒక స్త్రీ కొన్ని కారణాల వలన తన భర్తను హత్య చేస్తుంది. ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. 📖ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 🗓️📺


 
 
bottom of page