top of page

కల్కి సినిమాపై అభిమానులకు షాకిచ్చిన కమల్ హాసన్.. ?🎥✨


పాన్ ఇండియా మూవీ లవర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.తాజాగా కల్కి విషయంలో అభిమానులకు షాకిచ్చారు కమల్ హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మూడు సినిమాలపై అప్డేట్స్ ఇచ్చారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. కల్కి సినిమాలో తాను కేవలం అతిథి పాత్రలో కనిపించనున్నానని అన్నారు. అలాగే తన రోల్ షూటింగ్ కూడా కంప్లీ్ట్ అయ్యిందని అన్నారు. దీంతో ఈ మూవీలో కమల్ పాత్ర పెద్దగా స్కోప్ లేదని తెలిసి అభిమానులు నిరాశ చెందారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్రను గెస్ట్ రోల్ అనుకున్నా.. అతడి పాత్ర ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయని.. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే రిలీజ్ కానుందని అన్నారు.🎥✨

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page