top of page

ఎన్టీఆర్ సినిమా కోసం రేటు పెంచేసిన జాన్వీ కపూర్..


NTR 30 సినిమాలో నటించడానికి జాన్వీ కపూర్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. నిజానికి ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి జాన్వీ కపూర్ తీసుకున్న మొత్తం కంటే ఇది చాలా ఎక్కువని సమాచారం. బాలీవుడ్ సినిమాలకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్న జాన్వీ.. తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసి రూ.5 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఆమె కన్నా సీనియర్ అయిన కియారా అద్వానీ పారితోషికం కంటే అధికం కావడం విశేషం. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించిన కియారా.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన రెండోసారి నటిస్తున్నారు. RC15 మూవీలో చరణ్, కియారా ఆడిపాడుతున్నారు. ఈ సినిమా కోసం కియారా రూ.3.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

 
 
bottom of page