top of page

నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..


సూర్య మాట్లాడుతూ..”మన మనసు స్టీరింగ్ లాంటిది. గోల్ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు.. చదువు పూర్తైన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశాను. రూ.1200 జీతం. కానీ ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశాను. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్నాను.. అప్పుడే నటుడిగా మారాలని అనుకున్నాను.. షూటింగ్ ఐదు రోజుల ముందు వరకు నటుడిగా మారుతున్నాను అంటే నమ్మకం కలగలేదు. నేరుక్కు నేర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.. విజయ్ హీరోగా మణిరత్నం నిర్మించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అడియన్స్ ప్రేమాభినాలు చూసి నేను నటుడిగా అర్హుడినే అనుకున్నాను.. కష్టపడి, క్రమశిక్షణతో పనిచేయాలనుకున్నాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నాను ” అని అన్నారు. జైభీమ్ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేలు జర్నలిస్టుగా పరిచయమై స్నేహితుడయ్యాడని.. నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తుంటాడని… అతడితో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పుకొచ్చారు. అగరం అంటే ‘అ’ కారం.. అంటే తొలి అక్షరం అని అన్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page