top of page

పరారీలో నటి జయప్రద..? 🎭

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు సూచించింది కోర్టు.

ree

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచార నియమావళిని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జయప్రద పై కేసు నమోదైంది. ప్రస్తుతం దీని పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే కోర్టు పలుసార్లు సమన్లు ​​జారీ చేసినప్పటికీ జయప్రద విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయప్రదకు కోర్టు పలుమార్లు సమన్లు ​​జారీ చేసింది. అయితే దీనిపై ఆమె స్పందించలేదు. దీంతో జయప్రదపై కోర్టు వారెంట్ జారీ చేసింది. మార్చి 6న కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

మంగళవారం (ఫిబ్రవరి 27) విచారణలో జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు నేరుగా ప్రకటించింది. ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి మార్చి 6న జయప్రదను విచారణకు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఓ టీమ్‌ జయప్రదను గాలించనుంది. జయప్రదపై పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేకపోయారు. సీనియర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జయప్రద మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాంతో ఆమెను సంప్రదించలేకపోయారు. 🕵️‍♀️


 
 
bottom of page