జపాన్ మూవీ రివ్యూ.. ఒకరు అలా.. ఇంకొకరు ఇలా 🎥 💫
- Suresh D
- Nov 10, 2023
- 1 min read
కార్తీ సినిమాకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళంలో కంటే తెలుగులోనే ఆయన సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. ఇక్కడి ప్రేక్షకులు కార్తీని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అందుకే ఆయన చిత్రాలన్నీ ఎక్కువగా తెలుగులోకి డబ్ అవుతుంటాయి. తాజాగా కార్తీ నటించిన జపాన్ మూవీ వచ్చింది. నేడు ఈ మూవీ థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయింది. 🎥 💫

'జపాన్' ప్రచార చిత్రాలు, ముఖ్యంగా కార్తీ డైలాగులు పలికిన తీరు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశాయి. అందులోనూ ఇది కార్తీ 25వ సినిమా కావడం, కార్తీతో 'ఖైదీ' & 'కాష్మోరా' వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం కావడంతో ప్రేక్షకులు అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే...
'జపాన్' స్టార్టింగ్ బావుంటుంది. దొంగ & పోలీస్ మధ్య క్యాట్ & మౌస్ గేమ్ టైపులో ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే... ఆ ఆశలు, భ్రమలు తొలగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. దొంగ & దొంగిలించిన డబ్బులతో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తీని చూపించారు. సినిమాలోని సినిమాలో దొంగ, పోలీస్... రెండు క్యారెక్టర్లు కార్తీ చేశారు. బహుశా... దర్శకుడు అది కామెడీ అని ఫీల్ అయ్యి ఉంటారు. స్క్రీన్ మీద ఆ సీన్ చూసే ప్రేక్షకుడు మాత్రం అసలు ఫీల్ కాడు. పైగా, సాగదీసినట్టు ఉంటుంది. అది చూసినప్పుడు 'అత్తారింటికి దారేది'లో బ్రహ్మానందం ఇంట్రడక్షన్ గుర్తుకు వస్తుంది. 'జపాన్'లోని చాలా సన్నివేశాల్లో కామెడీ వర్కవుట్ కాలేదు. మధ్య మధ్యలో కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.
కామెడీ సీన్లు తీయడం ఒక ఆర్ట్! హీరో కామెడీ టైమింగ్, యాస మాత్రమే బావుంటే సరిపోదు. సన్నివేశాల్లో కంటెంట్ కూడా ఉండాలి. 'జపాన్'లో అది మిస్ అయ్యింది. ప్రతి వారం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం సినిమా రిఫరెన్స్ డైలాగులు, సినిమాలపై వేసిన పంచ్ డైలాగులు నవ్విస్తాయి. పోలీస్ వ్యానులో సింబాలిజం, క్రింజ్, రివ్యూ రైటర్స్, సి సెంటర్ ఆడియన్స్ అంటూ కార్తీ చేసిన సీన్ అందరినీ నవ్విస్తుంది. చివరిలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ బేస్ చేసుకుని సినిమా తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని అనిపిస్తుంది.
టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. 🎥 💫