🇨🇦🇮🇳 ట్రూడో ఆరోపణలపై భారత్ ఫైర్..
- Shiva YT
- Sep 19, 2023
- 1 min read
🇨🇦 కెనడా ప్రధాని ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించడంతోపాటు.. రాజకీయ ప్రముఖులు “అటువంటి అంశాల” పట్ల బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.

“కెనడాలో ఆశ్రయం కల్పించి, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో 🇨🇦 కెనడా ప్రభుత్వం దుష్ట వైఖరి చాలా కాలంగా.. ఆందోళనగా మారింది” అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు 🇨🇦 కెనడాలో కొత్తవి కాదని ప్రకటనలో పేర్కొంది. కెనడా నుంచి పనిచేస్తున్న అన్ని “భారత వ్యతిరేక అంశాల”పై సత్వర చర్య తీసుకోవాలని కోరింది. 🌐🔍🌍🔒











































