🏛️ చరిత్రలోకి పార్లమెంట్ పాత భవనం..
- Shiva YT
- Sep 19, 2023
- 1 min read
🏛️సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి అడుగు పడనుంది. ఈ సందర్భంగా తొలి రోజు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ సెషన్ కాలవ్యవధి చూస్తే చాలా చిన్నది కావచ్చు కానీ ఇది చాలా చరిత్రాత్మకమైనది అన్నారు.

🏛️ కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్ల వ్యవధిలో 2023 మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారు. కొత్త పార్లమెంటు భవనం బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే జాతీయ సంకల్పానికి చిహ్నంగా అభివర్ణించారు.
🏛️ కొత్త పార్లమెంటు భవనాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం 15 జనవరి 2021న సజావుగా ప్రారంభమైంది. దీన్ని పూర్తి చేయడానికి 2022 నవంబర్ వరకు గడువు విధించారు. అయితే ఇది పూర్తి కావడానికి మే 2023 వరకు సమయం పట్టింది. ఈ భవనం అధికారికంగా 28 మే 2023న ప్రారంభమైనప్పటికీ సభా కార్యక్రమాలు మాత్రం తొలిసారిగా సెప్టెంబర్ 19న (నేడు) వినాయక చవితి పర్వదినాన ప్రారంభం కానున్నాయి. 🏗️🏛️📅🧐👷♂️🏢🇮🇳











































