🌾🍚 మోడీ సర్కార్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలపై ప్రభావం.. 🌾🍚
- Suresh D
- Jul 29, 2023
- 1 min read
జూలై 20, 2023న, భారత ప్రభుత్వం సన్నబియ్యం ఎగుమతిని నిషేధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్. ప్రపంచ ఎగుమతుల్లో 40 శాతం భారత్‌దే.🇮🇳🌾 కానీ దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం విషయంలో రాజీపడకుండా మోదీ ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది.

జూలై 20, 2023న, భారత ప్రభుత్వం సన్నబియ్యం ఎగుమతిని నిషేధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్. ప్రపంచ ఎగుమతుల్లో 40 శాతం భారత్‌దే.🇮🇳🌾 కానీ దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం విషయంలో రాజీపడకుండా మోదీ ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. దీని తర్వాత మాత్రమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఎన్నారైలు, ఆఫ్రికా మూలాలున్న పౌరులు బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, సరఫరా సమస్యల కారణంగా ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడింది. గోధుమల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు వంటనూనెల ధరలు కూడా పెరిగాయి. ఆ సమయంలో కూడా దేశీయ మార్కెట్‌లో ధరలను నియంత్రించడానికి భారతదేశం గోధుమల ఎగుమతిని నిషేధించింది.🚫🍚 ఇప్పుడు బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు.భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఐఎంఎఫ్ కోరింది. గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ దృష్ట్యా, అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ కూడా భారతదేశం నుంచి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని అభ్యర్థించారు. ఇది మొత్తం ప్రపంచంలో సంక్షోభాన్ని సృష్టించవచ్చు. ఈ తరహా నిషేధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు.📈📉










































