‘అగ్ని-5’ మిషన్ వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త షీనా రాణి 🔥
- Shiva YT
- Mar 13, 2024
- 1 min read
‘మిషన్ దివ్యాస్త్ర’ ప్రాజెక్టులో భాగంగా బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించింది డీఆర్‌డీఓకు చెందిన మహిళా శాస్త్రవేత్త షీనా రాణి. హైదరాబాద్‌లోని DRDO సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ శాస్త్రవేత్తగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనిమిదేళ్ల పాటు విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్‌లో పనిచేసిన షీనా.. 1998లో డీఆర్‌డీఓలోకి మారారు. 🔬🚀








































