గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ, బీజేపీ నేత కుమారుడు అరెస్ట్..!🚓🚨
- Suresh D
- Feb 26, 2024
- 1 min read
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటలో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల తనిఖీల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ నేత కుమారుడితో పాటు ఓ వ్యాపారవేత్త కుమారుడు, మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా, గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టార్ హోటల్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది. పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు... డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నాయకుడి కుమారుడు ఉండటం గమనార్హం.కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి సదరు నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారని ఆరా తీస్తున్నారు.🚓🚨








































