top of page

చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..


ree

రోహిత్ శర్మ వారసుడిగా టీ20ల్లో సారథి బాధ్యతలు అందుకున్న టీమిండియా నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి సిరీస్‌ను విజయవంతంగా ముగించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశాడు. కెప్టెన్, బ్యాటర్‌గా కాకుండా ఈ సారి బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న సూర్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. పల్లెకెలె వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. రియాన్ పరాగ్ (26; 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (25; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. ఓ దశలో భారత్ స్కోరు 30/4, 48/5 మాత్రమే. ఈ స్థితిలో గిల్-పరాగ్-సుందర్ బ్యాటుతో గొప్ప పోరాటం చేశారు.ఛేదనలో శ్రీలంక 15 ఓవర్లకు 108/1తో పటిష్టస్థితిలో నిలిచింది. కానీ అంతిమంగా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్‌లో లంక 3 బంతుల్లో 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో భారత్ తొలి బంతికే బౌండరీ బాది విజయం సాధించింది.

కాగా, సూపర్బ్ కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు ఆఖరి టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటిన సూర్య ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అత్యధిక సార్లు అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ అవార్డు అత్యధికంగా అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షకిబ్ అల్ హసన్, డేవిడ్ వార్నర్‌‌లతో కలిసి సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురు అయిదు సార్లు ఈ అవార్డు అందుకున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి (6 సార్లు) ఉన్నాడు.

 
 
bottom of page