top of page

🌾🐣 పిల్లలకు పరగడుపున ఈ ఫుడ్స్ పెడితే బలంగా తయారవుతారు! 🍚🐣

🐣 గుడ్లు: పిల్లలకు ఉదయాన్నే ప్రతి రోజూ ఉడకబెట్టిన కోడి గుడ్డ పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని వారి రెగ్యులర్ డైట్‌లో యాడ్ చేయాలి. దీని వల్ల పిల్లల గ్రోత్‌లో మంచి రిజల్ట్ ఉంటుంది. మజిల్స్, టిష్యూస్ బిల్డ్ చేయడంలో సహాయం చేస్తాయి. కోడి గుడ్లను పూర్తిగా ఉడక బెట్టి కొంచెం కొంచెం పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఉదయం కోడి గుడ్డు తిని పించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది.

ree

🌱 పప్పులు: పిల్లలకు పప్పులతో తయారు చేసిన ఆహారాలు పెట్టడం కూడా చాలా మంచిది. ఇది తినడం వల్ల ఆరోగ్యంగా, బలంగా తయారవుతారు. పప్పులు పిల్లల బరువు పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా వారిలో జీర్ణ సమస్యలు కూడా తలెత్తకుండా చూస్తాయి. ముఖ్యంగా మల బద్ధకం సమస్య ఏర్పడదు. అంతే కాకుండా వారిలో తక్షణ శక్తి పెరుగుతుంది.

🍲 అరటి పండ్లు: పిల్లలకు ప్రతి రోజూ అరటి పండు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. కడుపు సంబంధిత సమ్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి. అంతే కాకుండా అరటి పండు తినడం వల్ల పిల్లలకు తక్షణ శక్తి అందడంతో పాటు, బరువు కూడా పెరుగుతారు.

🚰 గోరు వెచ్చని నీళ్లు: పరగడుపున పిల్లలకు గోరు వెచ్చటి నీళ్లు ఇవ్వడం వల్ల వారిలో మల బద్ధకం సమస్య ఏదైనా ఉంటే తగ్గుముఖం పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా నడుస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ వంటివి దరి చేరకుండా ఉంటాయి. 🌊💧

 
 
bottom of page