హరిహర వీరమల్లు అప్‌డేట్ ఇచ్చిన టీమ్..
- MediaFx
- Aug 10, 2024
- 1 min read
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఏపీ ప్రభుత్వం పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, ఆయన సినిమా ఊసులు మాత్రం ఫిల్మ్ నగర్‌లో నాన్‌స్టాప్‌గా వినిపిస్తూనే ఉంటాయి. లేటెస్ట్గా అనుపమ్‌ఖేర్ ఆన్ బోర్డు అనే వార్త, మరోసారి పవన్ సినిమా వార్తలను ట్రెండ్‌లో ఉంచుతోంది.
రెండు పార్టులుగా సిద్ధమవుతోంది హరిహరవీరమల్లు. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అనుపమ్ ఖేర్ ఆన్ బోర్డు అంటూ అనౌన్స్ చేసింది టీమ్.
ఆల్రెడీ అనుపమ్ ఖేర్ నటించిన కార్తికేయ2 ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన ప్రేక్షకులు మురిసిపోతున్నారు. హరిహరవీరమల్లులోనూ గౌరవప్రదమైన కేరక్టర్‌లో అనుపమ్ కనిపిస్తారని ప్రకటించారు మేకర్స్.
అంతే కాదు, అతి త్వరలోనే బ్యాలన్స్ షూట్‌ని స్టార్ట్ చేస్తామని, త్వరలోనే సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామనీ అన్నారు. అంతేనా... హరిహరవీరమల్లు నుంచి పవన్ కల్యాణ్ బర్త్ డే గ్లింప్స్ కూడా సిద్ధమవుతుందన్నది ఇన్‌సైడ్ న్యూస్
ఇటు ఓజీ మేకర్స్ కూడా పవన్ కల్యాణ్ బర్త్ డే గిఫ్ట్ గా స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారు. పుట్టినరోజు తర్వాతైనా పవన్.. ఫిల్మ్ నగర్‌వైపు చూస్తారా? లేకుంటే, ఈ ఏడాదికి ఇంతే సంగతులు అనుకోవాల్సిందేనా... ఒకరకమైన డైలమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో...