top of page

🌟 రాజకీయలకు గుంటూరు ఎంపీ గల్లా గుడ్‌బై..! సైకత శిల్పంతో ఘన వీడ్కోలు 🏛️🎉

చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా కుటుంబానికి రాజకీయాల్లో ఘనమైన చరిత్రే ఉంది. ఇందులో భాగంగానే పదేళ్ల క్రితం గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు గల్లా జయదేవ్.

ree

2014, 2019ల్లో పోటీ చేసి గెలిచిన జయదేవ్ వచ్చే ఎన్నికలకు తనతో పాటు తన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఇచ్చారు. సైకత శిల్పం ఏర్పాటుకు పన్నెండు గంటల సమయం పట్టినట్లు శిల్పి బాలాజీ చెప్పారు. అభిమానాన్ని సైకత శిల్పం రూపంలో చాటాలని జయదేవ్ అభిమానులు కోరడంతోనే ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశామన్నారు. గతంలో అయోధ్య రామ మందిర శిల్పంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించిన అనేక శిల్పాలను తయారు చేసినట్లు తెలిపారు. అయితే ఒక అభిమాని కోరిక మేరకు మొదటి సారి ఇటువంటి శిల్పాన్ని చేసినట్లు చెప్పారు. ఆత్మీయ విందుకు వచ్చిన అనేక మంది కార్యకర్తలు సైకత శిల్పాన్ని ఆసక్తికరంగా తిలకించారు. తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్న సాయిని కార్యకర్తలతో పాటు జయదేవ్ కూడా అభినందించారు. 🌟👏

 
 
bottom of page