పవన్ కల్యాణ్ అనే నేను..బాహుబలి సీన్ రిపీట్..!
- MediaFx
- Jun 12, 2024
- 1 min read
నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్‌గా జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది.
పవన్ అభిమానులు భారీగా ప్రమాణ స్వీకారంకు హాజరవడంతో పవన్ కళ్యాణ్ అను నేను.. అని పవన్ చెప్పడం మొదలుపెట్టగానే అభిమానులు, కార్యకర్తలు అరుపులు, విజిల్స్ తో సందడి చేసారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి సీన్ గుర్తొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్, స్టార్ డమ్ గురించి ఏపీలో అందరికి తెలిసిందే.
పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇవాళ నెరవేరింది అంటూ పోస్టులు చేస్తున్నారు.