top of page

రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాల మధ్య వివాదానికి తెర దించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇద్దరి ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది. దీనిలో భాగంగానే రోహిత్ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా నియమించాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు హార్దిక్ పాండ్యాను తొలగిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయని..అది జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించిన ముంబై యాజమాన్యం.. ఐపీఎల్ రెండో భాగంలో రోహిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మొదటి షెడ్యుల్‌లో హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తారని..రెండో భాగంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు తీసుకుంటారని సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page