top of page

🪙 బంగారం కొనుగోలు దారులకు రిలీఫ్‌...

🪙 బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ ఒడిదొడుకులకు లోనవుతున్న పసిడి ధరలు శుక్రవారం (సెప్టెంబర్‌ 15) మాత్రం స్థిరంగా కొనసాగాయి. 💰🏡

ree

🪙 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు... హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధరలకు లభిస్తోంది. 💵🏙️

🪙 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,990 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది. 🌆💎 చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450గా ఉంది. 🏙️🌟 ఇక కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 లుగా ట్రేడ్‌ అవుతోంది. 💍🌆

 
 
bottom of page