top of page

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 📈💨

దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ప్రారంభంతోనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండరుపైన 25 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు మార్చి 01 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1795 గా ఉంది. కోల్ కత్తాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2071.50 గాను, ముంబై లో రూ. 1749, బెంగళూరులో రూ. 1875లు , చెన్నైలో రూ. 1960.50 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2027లు, విజయవాడలో 19 రూ. 1959లు గా ఉంది. 💸🛢️


 
 
bottom of page