top of page

వీడియోపై నెటిజన్ల ఫన్నీ రెస్పాన్స్..!


మన దేశంలో రైళ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ప్రయాణీకులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. కొన్ని రైళ్లతో అయితే గాలి దూరే సందు కూడా ఉండదు. ఉత్తర భారతంలో నడిచే రైళ్లలో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటు దొరికింది అంటే.. సుడి ఉన్నట్లే లెక్క. సీట్లు లేక వేలాడుతూ వెళ్లడం.. బాత్రూమ్స్‌లో నిల్చుని ప్రయాణించడం వంటి సీన్స్ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక ట్రైన్‌లో సీటు కోసం కొందరు కొత్త తరహా ఐడియాలు వేస్తుంటారు. ఇదిగో ఇతగాడి ప్లాన్ ఆ కోవకు చెందినదే. ట్రైన్‌లో సీట్లు లేకపోవడంతో.. ఓ వ్యక్తి బెడ్ షీట్ సాయంతో.. ఇదిగో ఇలా ప్లాన్ చేస్కుని ఎంచక్కా అందులో కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ట్రైన్‌లోని ఓ ప్రయాణికుడు ఇతగాడి పనిని వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయింది.



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page