పెళ్ళికి వచ్చిన ఎమ్మెల్యే షాకింగ్ నిర్ణయం..
- Shiva YT
- May 30, 2023
- 1 min read
సాధారణంగా పెళ్లయిన తర్వాత వరుడు అలకపాన్పు ఎక్కడం సహజం.. సంప్రదాయం. కానీ ఇక్కడ ఓ వరుడు పెళ్లి పీటలమీదే అలిగి కూర్చున్నాడు. ముహూర్తం టైమ్‌కి అత్తింటివారు ఇస్తానన్న బైక్ ఇవ్వలేదని అమ్మాయి మెడలో తాళికట్టనని భీష్మించుకు కూర్చున్నాడు.

సాధారణంగా పెళ్లయిన తర్వాత వరుడు అలకపాన్పు ఎక్కడం సహజం.. సంప్రదాయం. కానీ ఇక్కడ ఓ వరుడు పెళ్లి పీటలమీదే అలిగి కూర్చున్నాడు. ముహూర్తం టైమ్‌కి అత్తింటివారు ఇస్తానన్న బైక్ ఇవ్వలేదని అమ్మాయి మెడలో తాళికట్టనని భీష్మించుకు కూర్చున్నాడు. బైక్ ఇచ్చాకే తాళకడతానని మొండికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్లికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరుడికి సర్ధి చెప్పినా వినలేదు. దాంతో ఆయన వధువు తరపున బైకుకు సంబంధించి 50 వేల రూపాయలు వరుడికి ఇచ్చారు. మిగతా సొమ్ము కూడా ఇస్తానని హామీ ఇచ్చాకే వరుడు అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. ఈ విచిత్ర సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటుచేసుకుంది.