ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ సీన్..
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
Updated: Mar 26, 2024
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. తమ పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులను సైతం ప్రకటిస్తు్న్నాయి. శనివారం వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈసారి ఎన్నికల్లో ఒకరూ ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి మొత్తం ఐదుగురూ పోటీపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైఎస్ జగన్, టీడీపీ నుంచి బాలకృష్ణ, లోకేష్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఈసారి ఎలక్షన్ లో పోటీపడనున్నారు.



Comments