వారణాసిలో మోదీతో తలపడేది ఆయనే
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను మరోసారి ప్రధాని మోడీపై పోటీకి దించింది. వారణాసి నియోజకవర్గం నుంచి అజయ్ రాయ్ ఇప్పటివరకు రెండుసార్లు మోడీపై పోటీ చేయగా, రెండుసార్లు కూడా ఘోర ఓటమిని చవిచూశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన నాలుగో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. మొత్తం 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రచురించగా.. వీరిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం డిగ్గీ రాజాతో పాటు వారణాసిలో మోదీ ప్రత్యర్ధి ఉన్నారు. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ఉత్తర్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహరాన్‌పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తనయుడు వీరేందర్ రావత్‌లకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అలాగే, తమిళనాడులోని శివగంగైన నుంచి సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ, విరుద్‌నగర్ నుంచి మాణికం ఠాగూర్‌లను పోటీకి నిలిపింది.



Comments