పోరాడి ఓడిన పి.వి సింధు..పారిస్ ఒలింపిక్స్ లో ఓటమి.
- MediaFx
- Aug 3, 2024
- 1 min read
Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరుకుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేకపోయింది.