కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న భక్తులు..
- MediaFx
- Aug 3, 2024
- 1 min read
ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన కేదార్‌నాథ్ యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గౌరీకుంద్, కేదార్‌నాథ్ దారిలో కొండచరియలు విరిగిపడటంతో వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. అందులో 18 మంది యాత్రికులు గల్లంతయ్యారు. దాంతో రంగంలోకి దిగిన NDRF రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మూడువేల మంది యాత్రికులను రక్షించింది. గల్లంతైన 18 మంది కోసం హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దింపింది.