ఏప్రిల్, జూన్ నెలలో విపరీతమైన ఎండలు..
- Shiva YT
- Apr 2, 2024
- 1 min read
భారతదేశం ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో విపరీతమైన వేడిని ఎదుర్కొంటుందని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాలు భానుడు భగభగలతో మండిపోనున్నాయని అంచనా వేస్తున్నట్లు IMD సోమవారం తెలిపింది.
భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ ఏప్రిల్-జూన్ కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో అధిక సంభావ్యత ఉంటుందని తెలిపారు.పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ కాలంలో మైదానాల్లోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది.