మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- MediaFx
- Apr 20, 2024
- 1 min read
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మరోసారి ఈవీఎంల కలకలం చెలరేగింది. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందంటూ గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రం, ఈసీ వాటిని తోసిపుచ్చాయి. అయితే తాజాగా కేరళలోని కాసర్ గోడ్ లో మరోసారి దీన్ని అవునని నిరూపించే ఘటన చోటు చేసుకుంది. స్దానిక మీడియా సంస్ధ మనోరమా అందించిన వివరాల ప్రకారం మాక్ పోలింగ్ సందర్భంగా ఈ మోసం బయటపడింది. అసలేం జరిగిందంటే..కేరళలోని కాసర్ గోడ్ లోక్ సభ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎన్నికల కోసం ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఇందులో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ తో పాటు బీజేపీ అభ్యర్ధుల పోలింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవీఎంలలో తమ గుర్తులు ఉన్న బటన్లు నొక్కుతుంటే ఓట్లు మాత్రం బీజేపీ గుర్తు కమలానికి పడుతున్నాయంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.