top of page

ప్రతిరోజూ ఓ ప్రత్యేకమే..జనంలో జగన్..

ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మధ్యాహ్నం కావలి సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. కడప నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లా చూసినా.. ఏ పల్లె చూసినా.. అడుగడుగున బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

ree

ఏపీ సీఎం జగన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలు ఇవి. ప్రజలతో ఆయన ఎలా కనెక్ట్‌ అవుతున్నారో చాటే దృశ్యాలు అందిరినీ ఆకట్టుకుంటున్నాయి.

అభిమానం పోటెత్తుతోంది. ఆత్మీయత ఆహ్వానం పలుకుతోంది. అభిమాన నేత పలకరింపు కోసం కొందరు.. కష్టాలు చెప్పుకునేందుకు ఇంకొందరు. సీఎం జగన్ బస్సు యాత్రలో దృశ్యాలు ఆసక్తి రేపుతున్నాయి. అన్న అని పిలిచే వారికి నేనున్నాంటూ బస్సు దిగి వచ్చి చేయి కలుపుతున్నారు సీఎం జగన్. చేయి ఎత్తిన వారికి ఏ కష్టం వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు. అభిమానం చూపే వారిని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. సెల్ఫీ కోసం ఉత్సాహం చూపే వారి సరదా తీర్చుతున్నారు.

ప్రతీ రోజు ఓ ప్రత్యేకం. ప్రతీ సందర్భం ఓ జ్ఞాపకం. సీఎం జగన్ బస్సు యాత్ర అనేక స్మృతులు, మరెన్నో అనుభవాలను పంచుతుంది.

మొదటి రోజు..

జగన్‌తో సెల్పీ దిగేందుకు ఆరాటపడ్డాడో యువకుడు. అయితే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ పోలీసులకు సర్ది చెప్పి తానే స్వయంగా దగ్గరకు వచ్చి యువకుడితో సెల్ఫీ దిగి ఆనందపరిచారు.

రెండో రోజు..

నడవలేని యువకుడి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకలించారు సీఎం జగన్. అతను గీసిచ్చిన ఫొటో చూసి మురిసిపోయారు సీఎం.

ఐదో రోజు..

మరో సందర్భంలో వింత వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాల ఆరోగ్య సమస్య గురించి ఆరా తీశారు.

ఆరో రోజు..

ఇక 6వ రోజు బస్సు యాత్రలో జగన్‌కు తన కష్టాలు చెప్పుకునేందుకు యత్నించాడు ముస్లిం వ్యక్తి. ఇది గమనించిన సీఎం జగన్‌ దగ్గరకు పిలిపించుకొని ఆప్యాయంగా మాట్లాడారు..

ఏడో రోజు..

ఏడు రోజు మామయ్య అంటూ సీఎం జగన్‌కు ముద్దు పెట్టింది ఓ చిన్నారి. సీఎం జగన్ సైతం అదే విధంగా మైమరిచిపోయారు.

8వ రోజు..

8వ సెల్ఫీ కోసం బస్సు వెంట పరుగులు తీశాడో యువకుడు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి అతనితో సెల్ఫీ దిగారు.

 
 
bottom of page