జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ మృతి..
- MediaFx

- Aug 14, 2024
- 1 min read
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత కొనసాగుతోంది. దేశ రక్షణకై జవాన్లు (Soldiers) ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది జవాన్లు ఎదురు కాల్పుల్లో (Encounter) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బుధవారం కూడా జమ్మూలోని దోడా (Doda) జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ (Army Captain Killed) అమరుడయ్యారు. దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ (48 Rashtriya Rifles) కెప్టెన్ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.












































