top of page

👨‍⚖️ ప్రముఖ న్యాయనిపుణుడు ఫాలీ ఎస్ నారిమన్ కన్నుమూత 📜

👨‍⚖️ ప్రముఖ న్యాయనిపుణుడు, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 95 ఏళ్ల నారిమన్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

🇮🇳 భారత న్యాయవ్యవస్థకు భీష్మ పితామహ:👨‍⚖️ భారత న్యాయవ్యవస్థకు నారిమన్ ను భీష్మ పితామహుడుగా పిలుస్తారు. పద్మ విభూషణ్ గ్రహీత నారిమన్ సుప్రీంకోర్టులో అనేక సంచలనాత్మక కేసులను వాదించి, పలు కొత్త చట్టాల రూపకల్పనకు దోహదపడ్డారు. తన అసాధారణ వాక్చాతుర్యం, పదునైన వాదనతో, నారిమన్ అనేక రాజ్యాంగ ధర్మాసనాల ముందువాదించారు. ఆయన వాదనలతో రాజ్యాంగంలోని నిబంధనలను అర్థం చేసుకోవడానికి, న్యాయవ్యవస్థను పునర్నిర్వచించడానికి అత్యున్నత న్యాయస్థానానికి సహాయపడింది.

📜 గోలక్ నాథ్ కేసు :👨‍⚖️ న్యాయవాదిగా నారిమన్ వాదించిన కొన్ని కీలక కేసులలో గోలక్ నాథ్ కేసు (రాజ్యాంగ సవరణలు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి), టిఎంఎ పాయ్ కేసు (మైనారిటీలు తమకు నచ్చిన సంస్థలను స్థాపించే హక్కు), ఎస్పీ గుప్తా మరియు ఎన్జేఏసీ కేసు (న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం).. మొదలైనవి ముఖ్యమైనవి.

📚 రచయిత కూడా..:👨‍⚖️ మాజీ రాజ్యసభ సభ్యుడైన నారిమన్ గొప్ప రచయిత కూడా. 'బిఫోర్ ది మెమరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీం కోర్ట్' వంటి పుస్తకాలను రాశారు. నారిమన్ 1929 జనవరి 10న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని రంగూన్ లో జన్మించారు. 1950 నవంబరులో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన 1961లో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. నారిమన్ తొలుత బాంబే హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో 70 ఏళ్లకు పైగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1972 మేలో భారత అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమితులైన ఆయన 1975 జూన్ 26న ఎమర్జెన్సీ విధించిన మరుసటి రోజే రాజీనామా చేశారు. ఆయన కుమారుడు జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 📚

 
 
bottom of page