top of page

యూట్యూబ్‌కు పోటీగా ‘ఎక్స్’ టీవీ.. 📺

వీడియోల కేటగిరీకి సంబంధించినంత వరకూ యూ ట్యూబ్ మించిన ప్లాట్ ఫారం మరొకటి లేదని చెప్పొచ్చు. షార్ట్ వీడియోల దగ్గర నుంచి గంటల తరబడి ఉండే పెద్ద వీడియోల వరకూ అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఇదే. ప్రస్తుతానికి గ్లోబల్ వైడ్ యూట్యూబ్ కి సరైన పోటీ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఎక్స్(గతంలో ట్విట్టర్) దీనిపై దృష్టి పెట్టింది. త్వరలోనే యూట్యూబ్ ప్రత్యామ్నాయంగా మరో ప్లాట్ ఫారం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగానే సూచన ప్రాయంగా తెలియజేశారు. అతి పెద్ద స్క్రీన్ పై చూడగలిగే విధంగ ఎక్స్ టీవీ యాప్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 🚀📱



 
 
bottom of page