షారుక్ ఖాన్ డంకీ సినిమా రన్ టైమ్ ఇదే..🎬🕺
- Suresh D
- Dec 18, 2023
- 1 min read
తాజాగా డంకీ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. షారుక్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలని తెలిసింది. U/A సర్టిఫికేట్ పొందడం సినిమాకు చాలా ఉపయోగకరం.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్, తాప్సీ పన్ను జంటగా నటించిన డంకీ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 21న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పఠాన్, జవాన్‌ల తర్వాత షారుక్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. విడుదలకు దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా డంకీ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. షారుక్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలని తెలిసింది. U/A సర్టిఫికేట్ పొందడం సినిమాకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు. కాబట్టి ‘డంకీ’ సినిమాని పిల్లలతో కలిసి వచ్చి చూడాలనుకునే ప్రేక్షకులకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంది.🎬🕺












































