ఏడాదిలో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే.. మూతపడిన ఎయిర్‌పోర్ట్..! 🌧️
- Suresh D
- Apr 17, 2024
- 1 min read
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో.. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా దుబాయ్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 🌊
కుండపోత వర్షాల కారణంగా ప్రపంచంలోకెల్లా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ✈️ వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకూ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. 🏙️ అయితే దుబాయ్ నుంచి బయల్దేరే విమానాలు మాత్రం యథావిధిగా బయల్దేరుతాయని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ✈️ నీటితో నిండిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్టును చూస్తే.. వర్షాకాలంలో తరచుగా నీటమునిగే చెన్నై ఎయిర్‌పోర్ట్ గుర్తుకొచ్చింది. 🛬
భారీ వర్షాల కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 🚨 వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో దుబాయ్‌లోని జాతీయ రహదారులు, రోడ్లపై వాహనాలు నీట మునిగాయి. 🚗 రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. 🌃 దీంతో కొందరు వీధుల్లో సరదాగా పడవల్లో తిరిగారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 🌟
ఎడారి ప్రాంతమైన దుబాయ్‌లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లకు కాస్త ఎక్కువ కాగా.. మంగళవారం సాయంత్రానికి దుబాయ్‌లో 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ☔ ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది. వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలు దుబాయ్ ప్రజల ఆందోళనను మరింత పెంచాయి. 🌧️