top of page

🏡 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న గృహలక్ష్మి పథకం తొలి లబ్ధిదారులు ఎవరో తెలుసా.. ? 🤔

👨‍💼మంత్రి కేటీఆర్ చేనేత కార్మికురాలు పావని పరిస్థితిని అర్ధంచేసుకొని గృహాలక్ష్మి పథకాన్ని పావనికి మంజూరు చేయాలనిఅధికారులను ఆదేశించారు.

చుక్క పావనికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి నెరవేర్చారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి‎లు పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాన్ని పావని కుటుంబానికి అందజేసి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. దీంతో రాష్ట్రంలో మొట్ట మొదటి గృహాలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారురాలిగా పావని రికార్డులకు ఎక్కింది. నేత కార్మికురాలికి గృహలక్ష్మి పథకం అందజేయడం సంతోషంగా ఉందని, నిజమైన పేదల నాయకుడు కేటీఆర్ అని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అన్నారు. తమ పరిస్థితిని చూసి మంత్రి కేటీఆర్ గృహలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారురాలిగా సహాయాన్ని మంజూరు చేయడం పట్ల పావని సంతోషం వ్యక్తం చేస్తోంది. 💪🚀

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page