top of page

👍 ఇదే ఫైనల్‌.. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. 😎

🔥 రాబోయే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షాలకు అంతకుమించి చుక్కలు చూపించడం కూడా అంతే ముఖ్యం.. ఈ ముక్క కేసీఆర్‌కు తెలియంది కాదు.. ఎందుకంటే ఆయన మార్క్‌ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో.. ఊహించలేం.. కాకపోతే ఎంత పెద్ద లీడరైనా..

సైన్యం స్ట్రాంగ్‌గా లేకపోతే.. యుద్ధం చేయడం కష్టం.. ఇది కూడా పెద్దాయనకు బాగా తెలుసు.. అందుకే.. ఎలెక్షన్‌ రేటింగ్‌ రేసును బట్టి ఎమ్మెల్యేలను పిలిచి.. ప్రోగ్రెస్‌ రిపోర్టు ముందు పెట్టి మరీ క్లాసు పీకుతున్నారట పెద్దసార్‌.. గతం గతః..ఇప్పుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనని.. గులాబీ బాస్ నుంచి క్లాస్‌ చెప్పించుకున్న వాళ్లు వేరేవారికి సలహాలు ఇస్తూ మొరపెట్టుకుంటున్నారట..

🚀 అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అన్నింటిని సరిచూసుకోవాల్సిన సమయం. ఎవరినీ కాదనలేరు.. అక్కున చేర్చుకోలేరు.. ఇలాంటి సమయంలోనే ప్రగతి భవన్‌ నుంచి ఫోన్‌ వస్తుంది.. అందులో వచ్చే ఓ వాయిస్‌ నుంచి.. మిమ్మల్ని పెద్దసార్‌ రమ్మంటున్నారని డేటు, టైమ్‌ వస్తాయి.. ఈ మాట వినేసరికి ఇవతలి వాళ్లకు.. పెద్దసార్‌ దగ్గర జరిగేది కళ్ల ముందు ఐమాక్స్‌లో కనిపిస్తుంది.. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి పిలుస్తున్నారు సీఎం కేసీఆర్. 😌

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page