top of page

ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?

ree

రాహుల్ గాంధీ ఫస్ట్ టైమ్ బరిలో దిగిన రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే.. ఈ సీటు రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ పోటీ చేసారు. ఆ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ వాళ్లిద్దరి తర్వాత ఆయన తల్లి సోనియా గాంధీ ఎంపీలుగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి చట్ట సభల్లో ప్రవేశించారు. ఇక 1996, 99 ఎన్నికల్లో మాత్రం ఈ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లింది. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ రాయబరేలి నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి బరిలో నిలిచారు. లోక్ సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ లేదా పెద్దల సభ అని పిలుస్తారు. లోక్ సభకు స్పీకర్ బాధ్యత వహిస్తారు. అదే విధంగా రాజ్యసభకు మాత్రం చైర్మన్ ఉంటారు. ఈ క్రమంలో ఎంపీలుగా ఎన్నికైన వారు పొందే జీతభత్యాలు, సదుపాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోక్ సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎంపీగా ఎన్నికైన వారికి ప్రతినెల లక్ష రూపాయలు వస్తుంది. ఇతర అలవెన్సులు అన్ని కలుపుకుని నెలకు 1.30 లక్షలు వస్తాయి. ఎంపీగా ఎన్నికైన వ్యక్తికి, ఆయన సతీమణికి ఏడాదికి 34 సార్లు ఉచితంగా విమాన ప్రయాణం,ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తారు. ఇక ఏదైన ఆరోగ్య టెస్టులు కోసం.. అన్నిరకాల లాబోరేటరీలు, ఈసీజీలు, డెంటల్, చర్మ సంబంధ నిపుణులు, కంటికి చెందిన ఎలాంటి సమస్యలకైన ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉచితంగా వసతిని కూడా కల్పిస్తారు. ఎంపీ పదవిలో ఉండగా.. మూడు టెలిఫోన్లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా ఏడాదికి యాభై ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎంపీగా ఎంపికై వ్యక్తి రిటైర్ అయ్యాక కూడా ఆయనకు నెలకు యాభైవేల రూపాయల పెన్షన్ ను ఇస్తుంటారు. ఎంపీగా ఆయన పదవీకాలంలో చేసిన సేవలకు గాను ఈ విధంగా ప్రత్యేకంగా సదుపాయలు కల్పిస్తారు.

 
 
bottom of page