దుమ్మురేపిన ధనుష్..అదిరిపోయిన రాయన్ ట్రైలర్
- MediaFx

- Jul 17, 2024
- 1 min read
ధనుష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ధనుష్ తన 50వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాయన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం . ట్రైలర్‌లో ధనుష్ రెచ్చిపోయాడు. ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకుంటాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘రాయన్ ‘ సినిమాలో ధనుష్ పూర్తి మాస్ అవతార్‌లో ఉంటాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 50వ సినిమా కాబట్టి ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి ‘రాయన్ ‘లో నటించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ‘రాయాన్’ ట్రైలర్‌లో ప్రధాన పాత్రల గ్లింప్స్ చూపించారు. ‘రాయాన్’ సినిమాలో ఓ బాలుడి కథ క్రూరంగా మారుతుందని తెలుస్తోంది. ఆ అబ్బాయిలో ఆ మార్పుకి కారణం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘రాయన్’ జూలై 26న విడుదల కానుంది.












































