‘దేవర’ మూవీ షూటింగ్ వీడియో లీక్..🎥✨
- Suresh D
- Mar 22, 2024
- 1 min read
ఎన్టీఆర్- కొరటాల శివ పాన్ ఇండియన్ మూవీ 'దేవర' సినిమా గురించి ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్‌కి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి దసరాకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ దసరా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
దేవర టీమ్ ప్రస్తుతం గోవాలా షూటింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా దేవర సెట్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఎవరో దీన్ని దూరం నుంచి ఫోన్లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ తిరుగుతోంది. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని బీచ్ నుంచి అలా నడుచుకొని బయటికి వస్తున్నారు. ఇది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అయితే ఈ వీడియో లీకులపై దేవర టీమ్ మాత్రం ఫైర్ అవుతుంది.ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.🎥✨