ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ అనుకున్నదానికంటే ముందుగానే విడుదల
- MediaFx

- Jun 14, 2024
- 1 min read
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దేవర’, కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా రూపొందుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలిభాగం ‘దేవర పార్ట్ 1’ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై నాటికి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజి’ విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. దీనితో ‘దేవర’ చిత్రబృందం ఈ తేదీని లాక్ చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్త విని తెగ సంతోషపడుతున్నారు. రెండు వారాల ముందుగానే వస్తుండడంతో వారి ఆనందం మరింత పెరిగింది.












































