దేవర కోసం యానిమల్ విలన్..
- MediaFx
- Jul 26, 2024
- 1 min read
2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘దేవర: పార్ట్ 1’ చిత్రం మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే యానిమల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. బాబీ డియోల్ కూడా నటిస్తారనే వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి భాగం చివర్లో బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. అతన్ని మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. బాబీ డియోల్ కెరీర్ కొన్నాళ్లు డల్ గా ఉంది. అయితే గతేడాది ‘యానిమల్’ సినిమాతో ఆయన అదరగొట్టాడు. ఆ సినిమాలో నెగెటివ్ రోల్ అద్భుతంగా నటించాడు. యానిమల్ తర్వాత టాలీవుడ్‌లో ఆయనకు డిమాండ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’, బాలకృష్ణ నటించిన 109వ సినిమాలోనూ బాబీ డియోల్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు దేవరాలోనూ నటిస్తున్నాడని టాక్.