top of page

కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్

సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్తానని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. తన అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే..

తాను కూడా న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని పేర్కొన్నారు. వాళ్లు చేసింది కరక్ట్ అయితే.. ఇప్పుడు జరుగుతున్నది కూడా కరక్టేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు దానం. మూడు నెలల్లో ముఖ్యమంత్రి రూ. 3500 కోట్లు సంపాదిస్తే.. పదేళ్లలో బీఆర్ఎస్ వాళ్లు ఎన్ని సంపాదించి ఉండొచ్చని దానం ప్రశ్నించారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడబెట్టినట్లు చూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని దానం నాగేందర్ సవాల్ చేశారు. టీఆర్ఎస్‌లో ఓ కార్యకర్తగానే పనిచేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో తనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page