top of page

ఉప్పల్ మ్యాచ్ ప్రేక్షకులకు అలర్ట్, వాటిని తీసుకురావద్దన్న సీపీ

నగర క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫేవరేట్ జట్లు తలపడనున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. అయితే, ప్రేక్షకులకు పలు సూచనలు చేశారు సీపీ తరుణ్ జోషి. ల్యాప్‌ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధం ఉందని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సీపీ స్పష్టం చేశారు. అయితే, బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉందని తెలిపారు.బుధవారం నాటి మ్యాచ్‌కు మధ్యాహ్నం 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని సీపీ తెలిపారు.


 
 
 

Related Posts

See All

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page